50 sentences of simple present tense | Examples

Written by friendlyquizeducation.com

Updated on:

50 sentences of simple present tense

ప్రతీ రోజూ అలవాటుగా, క్రమం తప్పకుండా, సాధారణంగా, మరియు శాశ్వతమైన (తక్కువ కాలంలో మరియు ఎక్కువ కాలంలో జరిగే) పనులను Simple Present Tense లో చెప్పవచ్చు.

Subject I, we, you, they or plural nouns అయినట్లయితే ‘do’ అనే helping verb ను మరియు Verb యొక్క మొదటి రూపాన్ని ఉపయోగించాలి.

Subject He, she, it, or singular nouns అయినట్లయితే ‘does’ అనే helping verb ను మరియు Verb కు ‘S’ లేదా ‘es’ లేదా ‘ies’ ను చేర్చాలి.

Verb యొక్క చివరి letter ch, s, o, sh, x లతో ముగిస్తే ‘es’ ను చేర్చాలి.

Examples:-
He goes to the market every Monday. (go)
అతడు ప్రతి సోమవారం మార్కెట్ కి వెళుతుంటాడు.
She washes clothes everyday. (wash)
ఆమె రోజు బట్టలు ఉతుకుతుంది.
He teaches English. (teach)
అతడు ఇంగ్లీష్ బోధిస్తాడు.
It crosses the canal. (cross)
ఇది కాలువను దాటుతుంది.
It relaxes on a chair. (relax)
ఇది కుర్చీ పై విశ్రాంతి తీసుకుంటుంది.

Verb చివరి letter ‘Y’ తో end అయినట్లయితే Y కి ముందు Consonant letter ఉన్నట్లయితే ఆ ‘Y’ ని తీసేసి ‘ies’ ని add చెయ్యాలి.
Examples:-
It flies. (fly) – అది ఎగురుతాది.
She carries. (carry) – ఆమె తీసుకు వెళతాది.
He crise. (cry) – అతడు ఏడుస్తాడు.

Verb చివరి letter ‘Y’ తో end అయినట్లయితే Y కి ముందు Vowel letter ఉన్నట్లయితే ఆ ‘Y’ ని తీసేసి Verb కి ‘s’ ని add చెయ్యాలి.
Examples:-
He obeys. (obey) – అతను పాటిస్తాడు.
It enjoys. (enjoy) – అది ఆనందిస్తుంది.
She buys. (buy) – ఆమె కొంటుంది.

VOWELS (అచ్చులు) :- a, e, i, o, u
CONSONANTS ( హల్లులు) :- b, c, d, f, g, h, j, k, l, m, n, p, q, r, s, t, v, w, x, y, z.

క్రింది జరిగే actions లను Simple Present Tense లో చెప్పాలి.

Permanent (శాశ్వతంగా అనగా తక్కువ లేదా ఎక్కువ కాలంలో జరిగే పనులు).
Examples:-
We live in America. – మేము అమెరికాలో నివసిస్తాము.
He works at a bank. – అతను బ్యాంకులో పని చేస్తాడు.

Routines (ప్రతీ రోజూ అలవాటుగా జరిగే పనులు).
Examples:-
I wake up at 6:00 a.m. – నేను ఉదయం 6 గంటలకు మేల్కొంటాను.
I go to sleep at 11:00 p.m. – నేను రాత్రి 11 గంటలకు నిద్ర పోతాను.
We go to playground everyday – మేము ప్రతీ రోజూ ఆట మైదానానికి వెళ్తాము.

Schedule (సమయం ప్రకారం జరిగే పనులు).
Examples:-
Our class starts at 9:00 a.m. – మా తరగతి ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది.
The flight leaves at 7:00 p.m. – విమానం రాత్రి 7 గంటలకు బయలుదేరుతుంది.

Proverbs (సామెతలు).
Examples:-
Honor is the reward of with you. – సుగుణము గౌరవాన్ని తెచ్చి పెడుతుంది.
Words that more than swords. – ఈటెల బాధ కంటే మాటల బాధ ఎక్కువ.

Facts (నిత్య సత్యాలు).
Examples:-
The sun rises in the East. – సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.
The sunsets in the west. – సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తాడు.

Frequency (తరచుగా జరిగే పనులు).
Examples:-
She always takes the bus – ఆమె ఎప్పుడూ బస్సులో వెళ్తాది.
(Never ఎప్పుడూ కాదు 0%
rarely అరుదుగా 10-20%
sometimes కొన్నిసార్లు 50%
often తరచుగా 75%
always ఎల్లప్పుడూ 100%)
Always place లో పైవి కూడా ఉపయోగించుకోవచ్చు.

STRUCTURE:-
Subject + do / does + Verb1 (s / es / ies) + Object.

KEY WORDS:-
Always. (ఎల్లప్పుడూ)
Every day (ప్రతీ రోజూ), every month (ప్రతీనెలా) every year (ప్రతీ సంవత్సరం) every Sunday (ప్రతీ ఆదివారం) …
Normally. (సాధారణంగా)
Usually. (సాధారణంగా)
Generally (సాధారణంగా)
Sometimes. (కొన్నిసార్లు)
Seldom. (అరుదుగా)
Never. (ఎప్పుడూ కాదు)
Regularly (క్రమం తప్పకుండా)

EXAMPLES:-
I learn. (or) I do learn. – నేను నేర్చుకుంటాను.
You learn. (or) You do learn. – నీవు నేర్చుకుంటావు.
We learn. (or) We do learn. – మనము నేర్చుకుంటాము.
They learn. (or) They do learn. – వారు నేర్చుకుంటారు.
He learns. (or) He does learn. – అతడు నేర్చుకుంటాడు.
She learns. (or) She does learn. – ఆమె నేర్చుకుంటాది.
It learns. (or) It does learn. – అది నేర్చుకుంటాది.

మరిన్ని ఉదాహరణలను నేర్చుకుందాం.

(1). I learn English? – నేను ఆంగ్లం నేర్చుకుంటాను.
You learn English? – నీవు ఆంగ్లం నేర్చుకుంటావు.
We learn English? – మనము ఆంగ్లం నేర్చుకుంటాము.
They learn English? – వారు ఆంగ్లం నేర్చుకుంటారు.
He learn English? – అతడు ఆంగ్లం నేర్చుకుంటాడు.
She learn English? – ఆమె ఆంగ్లం నేర్చుకుంటాది.
It learn English? – అది ఆంగ్లం నేర్చుకుంటాది.

(2). Do I learn English? – నేను ఆంగ్లం నేర్చుకుంటానా?
Do you learn English? – నీవు ఆంగ్లం నేర్చుకుంటావా?
Do we learn English? – మనము ఆంగ్లం నేర్చుకుంటామా?
Do they learn English? – వారు ఆంగ్లం నేర్చుకుంటారా?
Does he learn English? – అతడు ఆంగ్లం నేర్చుకుంటాడా?
Does she learn English? – ఆమె ఆంగ్లం నేర్చుకుంటాదా?
Does it learn English? – అది ఆంగ్లం నేర్చుకుంటాదా?

(3). Why do I learn English? – నేను ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటాను?
Why do you learn English? – నీవు ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటావు?
Why do we learn English? – మనము ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటాము?
Why do they learn English? – వారు ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటారు?
Why does he learn English? – అతడు ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటాడు?
Why does she learn English? – ఆమె ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటాది?
Why does it learn English? – అది ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటాది?

(4). How do I learn English? – నేను ఆంగ్లం ఎలా నేర్చుకుంటాను?
How do you learn English? – నీవు ఆంగ్లం ఎలా నేర్చుకుంటావు?
How do we learn English? – మనము ఆంగ్లం ఎలా నేర్చుకుంటాము?
How do they learn English? – వారు ఆంగ్లం ఎలా నేర్చుకుంటారు?
How does he learn English? – అతడు ఆంగ్లం ఎలా నేర్చుకుంటాడు?
How does she learn English? – ఆమె ఆంగ్లం ఎలా నేర్చుకుంటాది?
How does it learn English? – అది ఆంగ్లం ఎలా నేర్చుకుంటాది?

(5). How long do I learn English? – నేను ఆంగ్లం ఎంత కాలం నేర్చుకుంటాను?
How long do you learn English? – నీవు ఆంగ్లం ఎంత కాలం నేర్చుకుంటావు?
How long do we learn English? – మనము ఆంగ్లం ఎంత కాలం నేర్చుకుంటాము?
How long do they learn English? – వారు ఆంగ్లం ఎంత కాలం నేర్చుకుంటారు?
How long does he learn English? – అతడు ఆంగ్లం ఎంత కాలం నేర్చుకుంటాడు?
How long does she learn English? – ఆమె ఆంగ్లం ఎంత కాలం నేర్చుకుంటాది?
How long does it learn English? – అది ఆంగ్లం ఎంత కాలం నేర్చుకుంటాది?

(6). Where do I learn English? – నేను ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటాను?
Where do you learn English? – నీవు ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటావు?
Where do we learn English? – మనము ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటాము?
Where do they learn English? – వారు ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటారు?
Where does he learn English? – అతడు ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటాడు?
Where does she learn English? – ఆమె ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటాది?
Where does it learn English? – అది ఆంగ్లం ఎక్కడనేర్చుకుంటాది?

(7). When do I learn English? – నేను ఆంగ్లం ఎప్పుడు నేర్చుకుంటాను?
When do you learn English? – నీవు ఆంగ్లం ఎప్పుడు నేర్చుకుంటావు?
When do we learn English? – మనము ఆంగ్లం ఎప్పుడు నేర్చుకుంటాము?
When do they learn English? – వారు ఆంగ్లం ఎప్పుడు నేర్చుకుంటారు?
When does he learn English? – అతడు ఆంగ్లం ఎప్పుడు నేర్చుకుంటాడు?
When does she learn English? – ఆమె ఆంగ్లం ఎప్పుడు నేర్చుకుంటాది?
When does It learn English? – అది ఆంగ్లం ఎప్పుడు నేర్చుకుంటాది?

(8). I do not (don’t ) learn English. – నేను ఆంగ్లం నేర్చుకోను.
You do not (don’t ) learn English. – నీవు ఆంగ్లం నేర్చుకోవు.
We do not (don’t ) learn English. – మనము ఆంగ్లం నేర్చుకోము.
They do not (don’t ) learn English. – వారు ఆంగ్లం నేర్చుకోరు.
He does not (doesn’t ) learn English. – అతడు ఆంగ్లం నేర్చుకోడు.
She does not (doesn’t ) learn English. – ఆమె ఆంగ్లం నేర్చుకోదు.
It does not (doesn’t ) learn English. – అది ఆంగ్లం నేర్చుకోదు.

(9). Do I not learn English?  – నేను ఆంగ్లం నేర్చుకోనా?
Do you not learn English?  – నీవు ఆంగ్లం నేర్చుకోవా?
Do we not learn English? – మనము ఆంగ్లం నేర్చుకోమా?
Do they not learn English?  – వారు ఆంగ్లం నేర్చుకోరా?
Does he not learn English?  – అతడు ఆంగ్లం నేర్చుకోడా?
Does she not learn English? – ఆమె ఆంగ్లం నేర్చుకోదా?
Does it not learn English? – అది ఆంగ్లం నేర్చుకోదా?

(10). Why do I not learn English?  – నేను ఆంగ్లం ఎందుకు నేర్చుకోను?
Why do you not learn English?  – నీవు ఆంగ్లం ఎందుకు నేర్చుకోవు?
Why do we not learn English?  – మనము ఆంగ్లం ఎందుకు నేర్చుకోము?
Why do they not learn English?  – వారు ఆంగ్లం ఎందుకు నేర్చుకోరు?
Why does he not learn English?  – అతడు ఆంగ్లం ఎందుకు నేర్చుకోడు?
Why does she not learn English? – ఆమె ఆంగ్లం ఎందుకు నేర్చుకోదు?
Why does it not learn English?  – అది ఆంగ్లం ఎందుకు నేర్చుకోదు?

(11). We speak English every day.
మేము ప్రతీ రోజూ ఆంగ్లం మాట్లాడతాము.
Do we speak English every day?
మేము ప్రతీ రోజూ ఆంగ్లం మాట్లాడతామా?
Why do we speak English every day?
మేము ప్రతీ రోజూ ఆంగ్లం ఎందుకు మాట్లాడతాము?
How do we speak English every day?
మేము ప్రతీ రోజూ ఆంగ్లం ఎలా మాట్లాడతాము?
How long do we speak English every day?
మేము ప్రతీ రోజూ ఆంగ్లం ఎంతసేపు
మాట్లాడుతాము?

We don’t speak English every day.
మేము ప్రతీ రోజూ ఆంగ్లము మాట్లాడము.
Don’t we speak English every day?
మేము ప్రతీ రోజూ ఆంగ్లము మాట్లాడమా?
Why do we not speak English every day?
మేము ప్రతీ రోజూ ఆంగ్లము ఎందుకు మాట్లాడము?

(12). My father goes to the gym every day.
మా నాన్న ప్రతీ రోజూ జిమ్ కి వెళ్తుంటారు.
Does my father go to the gym every day?
మా నాన్న ప్రతీ రోజూ జిమ్ కి వెళ్తుంటారా?
My father does not go to the gym every day.
మా నాన్న ప్రతీ రోజూ జిమ్ కి వెళ్ళరు.
Does my father not go to the gym every day?
మా నాన్న ప్రతీ రోజూ జిమ్ కి వెళ్ళరా?
Why does my father not go to the gym every day?
మా నాన్న ప్రతీ రోజూ జిమ్ కి ఎందుకు వెళ్ళరు?

(13). She likes Bananas.
ఆమెకు అరటి పండ్లు ఇష్టం.
Does she like bananas?
ఆమెకు అరటి పండ్లు ఇష్టమా?
She does not like bananas.
ఆమెకు అరటి పండ్లు ఇష్టం ఉండవు.
Does she not like bananas?
ఆమెకు అరటి పండ్లు ఇష్టం ఉండవా?

(14). It rains here every month.
ఇక్కడ ప్రతీనెలా వర్షాలు కురుస్తాయి.
Does it rain here every month?
ఇక్కడ ప్రతీనెలా వర్షాలు కురుస్తాయా?
It does not rain here every month.
ఇక్కడ ప్రతీనెలా వర్షాలు కురవవు.
Does it not rain here every month?
ఇక్కడ ప్రతీనెలా వర్షాలు కురవవా?

(15). Latha goes to church every week.
లతా ప్రతీ వారం చర్చికి వెళ్తాది.
Does Latha go to church every week?
లతా ప్రతీ వారం చర్చికి వెళ్తాదా?
Latha does not go to church every week.
లతా ప్రతీ వారం చర్చికి వెళ్లదు.
Does Latha not go to Church every week?
లత ప్రతీ వారం చర్చికి వెళ్లదా?
Why does Latha not go to church every week?
లతా ప్రతీ వారం చర్చికి ఎందుకు వెళ్ళదు?

(16). My mother cooks every day.
మా అమ్మ ప్రతీరోజు వంట చేస్తాది.
Does my mother cook every day?
మా అమ్మ ప్రతీరోజు వంట చేస్తాదా?
My mother does not cook every day.
మా అమ్మ ప్రతీరోజు వంట చేయదు.
Does my mother not cook every day?
మా అమ్మ ప్రతీరోజు వంట చేయదా?
Why does my mother not cook every day?
మా అమ్మ ప్రతీరోజు వంట ఎందుకు చేయదు?

(17). The bus usually comes late.
బస్సు సాధారణంగా ఆలస్యంగా వస్తుంది.
Does the bus usually come late?
బస్సు సాధారణంగా ఆలస్యంగా వస్తుందా?
The bus does not usually come late.
బస్సు సాధారణంగా ఆలస్యంగా రాదు.
Does the bus not usually come late?
బస్సు సాధారణంగా ఆలస్యంగా రాదా?

(18). My manager starts work on time.
నా మేనేజర్ సమయానికి పని ప్రారంభిస్తాడు.
Does my manager start work on time?
నా మేనేజర్ సమయానికి పని ప్రారంభిస్తాడా?
My manager does not start work on time.
నా మేనేజర్ సమయానికి పని ప్రారంభించడు.
Does my manager not start work on time?
నా మేనేజర్ సమయానికి పని ప్రారంభించాడా?

(19). Soldiers fight for the country.
సైనికులు దేశం కోసం పోరాడుతున్నారు.
Do soldiers fight for the country?
సైనికులు దేశం కోసం పోరాడుతున్నారా?
Do soldiers not fight for the country?
సైనికులు దేశం కోసం పోరాడటం లేదా?
Why do soldiers not fight for the country?
సైనికులు దేశం కోసం ఎందుకు పోరాడడం లేదు?

(20). He prays three times every day.
అతడు ప్రతీ రోజూ మూడుసార్లు ప్రార్థిస్తాడు.
Does he pray three times every day?
అతడు ప్రతీ రోజూ మూడుసార్లు ప్రార్థిస్తాడా?
He does not pray three times every day.
అతడు ప్రతీ రోజూ మూడుసార్లు ప్రార్థించడు.
Does he not pray three times every day?
అతడు ప్రతీ రోజూ మూడుసార్లు ప్రార్థించడా?

(21). Trains travel on railway tracks. (or)
Trains do travel on railway tracks.
రైలు పట్టాలపై రైళ్లు ప్రయాణిస్తాయి.
Do trains travel on railway tracks?
రైలు పట్టాలపై రైళ్లు ప్రయాణిస్తాయా?
Trains don’t travel on railway tracks. (or)
Trains do not travel on railway tracks.
రైళ్ల పట్టాలపై రైళ్లు ప్రయాణించవు.
Don’t trains travel on railway tracks? (or)
Do trains not travel on railway tracks?
రైళ్ల పట్టాలపై రైళ్లు ప్రయాణించవా?

(22). Birds fly in the sky. (or)
Birds do fly in the sky.
పక్షులు ఆకాశంలో ఎగురుతాయి.
Do birds fly in the sky?
పక్షులు ఆకాశంలో ఎగురుతాయా?
Birds do not (don’t) fly in the sky.
పక్షులు ఆకాశంలో ఎగరవు.
Don’t Birds fly in the sky?
Do birds not fly in the sky?
పక్షులు ఆకాశంలో ఎగరవా?

(23). I eat a burger every weekend. (or)
I do eat a burger every weekend.
నేను ప్రతీ వారంతంలో బర్గర్ తింటాను.
Do I eat a burger every weekend?
నేను ప్రతీ వారాంతంలో బర్గర్ తింటానా?
I do not (don’t) eat a burger every weekend.
నేను ప్రతీ వారాంతంలో బర్గర్ తినను.
Do I not eat a burger every weekend?
Don’t I eat a burger every weekend?
నేను ప్రతీ వారాంతంలో బర్గర్ తిననా?

(24). He does his homework regularly.
అతడు తన హోంవర్క్ ని క్రమం తప్పకుండా చేస్తాడు.
Does he do his homework regularly?
అతడు తన హోంవర్క్ ని క్రమం తప్పకుండా చేస్తాడా?
He doesn’t (does not) do his homework regularly.
అతడు తన హోంవర్క్ ని క్రమం తప్పకుండా చేయడు.
Doesn’t he do his homework regularly? (or)
Does he not do his homework regularly?
అతడు తన హోం వర్క్ ని క్రమం తప్పకుండా చేయడా?

(25). The earth moves around the sun. (or)
The earth does move around the sun.
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
Does the Earth move around the sun?
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందా?
The earth doesn’t (does not) move
around the sun.
భూమి సూర్యుని చుట్టూ తిరగడం లేదు.
Doesn’t the earth move around the sun? (or)
Does the Earth not move around the sun?
భూమి సూర్యుని చుట్టూ తిరగడం లేదా?

(26). We brush our teeth every day. (or)
We do brush our teeth every day.
మనం ప్రతీరోజు పళ్ళు తోముకుంటాము.
Do we brush our teeth every day?
మనం ప్రతీరోజు పళ్ళు తోముకుంటామా?
We do not (don’t) brush our teeth every day.
మనం ప్రతీరోజు పళ్ళు తోముకోము.
Don’t we brush our teeth every day? (or)
Do we not brush our teeth every day?
మనం ప్రతీరోజు పళ్ళు తోముకోమా?

(27). He sleeps late at night. (or)
He does sleep late at night.
అతడు రాత్రి ఆలస్యంగా నిద్రపోతాడు.
Does he sleep late at night?
అతడు రాత్రి ఆలస్యంగా నిద్రపోతాడా?
He doesn’t (does not) sleep late at night.
అతడు రాత్రి ఆలస్యంగా నిద్రపోడు.
Doesn’t he sleep late at night? (or)
Does he not sleep late at night?
అతడు రాత్రి ఆలస్యంగా నిద్రపోడా?

(28). The sun rises in the east. (or)
The sun does rise in the East.
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.
Does the sun rise in the East?
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడా?
The sun doesn’t (does not) rise in the East.
సూర్యుడు తూర్పున ఉదయించడు.
Doesn’t the sun rise in the East?
Does the sun not rise in the east?
సూర్యుడు తూర్పున ఉదయించడా?

(29). She loves to play cricket. (or)
She does love to play cricket.
ఆమె క్రికెట్ ఆడడానికి ఇష్టపడతాది.
Does she love to play cricket?
ఆమె క్రికెట్ ఆడడానికి ఇష్టపడతాదా?
She doesn’t (does not) love to play cricket.
ఆమె క్రికెట్ ఆడడానికి ఇష్టపడదు.
Doesn’t she love to play cricket? (or)
Does she not love to play cricket?
ఆమె క్రికెట్ ఆడడానికి ఇష్టపడదా?

(30). My father always washes the cars. (or)
My father does always wash the cars.
మా నాన్న ఎప్పుడూ కార్లు కడుగుతాడు.
Does my father always wash the cars?
మా నాన్న ఎప్పుడూ కార్లు కడుగుతాడా?
My father doesn’t (does not) always wash the cars.
మా నాన్న ఎప్పుడూ కార్లు కడగడు.
Does my father not always wash the cars?
Doesn’t my father always wash the cars?
మా నాన్న ఎప్పుడూ కార్లు కడగడా?

(31). Kids like to play mobile games. (or)
Kids do like to play mobile games.
పిల్లలు మొబైల్ గేమ్స్ ఆడటానికి ఇష్టపడతారు.
Do kids like to play mobile games?
పిల్లలు మొబైల్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడతారా?
Kids don’t (do not) like to play mobile games.
పిల్లలు మొబైల్ గేమ్స్ ఆడటానికి ఇష్టపడరు.
Do kids not like to play mobile games? (or)
Don’t kids like to play mobile games?
పిల్లలు మొబైల్ గేమ్స్ ఆడటానికి ఇష్టపడరా?

(32). My friends like to live a luxurious life. (or)
My friends do like to live a luxurious life.
నా స్నేహితులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు.
Do my friends like to live a luxurious life?

నా స్నేహితులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారా?
My friends don’t (do not) like to live a luxurious life.
నా స్నేహితులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడరు.
Don’t my friends like to live a luxurious life? (or)
Do my friends not like to live a luxurious life?
నా స్నేహితులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడరా?

(33). They work all day. (or)
They do work all day.
వారు రోజంతా పని చేస్తారు.
Do they work all day?
వారు రోజంతా పనిచేస్తారా?
They do not (don’t) work all day.
వారు రోజంతా పని చేయరు.
Don’t they work all day? (or)
Do they not work all day?
వారు రోజంతా పని చేయరా?

(34). I go to school by cycle. (or)
I do go to school by cycle.
నేను సైకిల్ మీద స్కూల్ కి వెళ్తాను.
Do I go to school by cycle?
నేను సైకిల్ మీద స్కూల్ కి వెళ్తానా?
I don’t (do not) go to school by cycle.
నేను సైకిల్ మీద స్కూల్ కి వెళ్ళను.
Don’t I go to school by cycle?
Do I not go to school by cycle?
నేను సైకిల్ మీద స్కూల్ కి వెళ్ళనా?

(35). The stars twinkle. (or)
The stars do twinkle.
నక్షత్రాలు మెరుస్తాయి.
Do the stars twinkle?
నక్షత్రాలు మెరుస్తాయా?
The stars don’t (do not) Twinkle.
నక్షత్రాలు మెరవవు.
Don’t the stars twinkle?
Do the stars not Twinkle?
నక్షత్రాలు మెరవవా?

(36). We generally sing songs all together. (or)
We do generally sing songs all together.
మేము సాధారణంగా అందరూ కలిసి పాటలు పాడతాము.
Do we generally Sing songs all together?
మేము సాధారణంగా అందరూ కలిసి పాటలు పాడుతామా?
We don’t (do not) generally sing songs all together.
మేము సాధారణంగా అందరూ కలిసి పాటలు పాడము.
Don’t we generally sing songs all together? (or)
Do we not generally Sing songs all together?
మేము సాధారణంగా అందరూ కలిసి పాటలు పాడమా?

(37). We go to a Gallery every Sunday. (or)
We do go to a Gallery every Sunday.
మేము ప్రతీ ఆదివారం గ్యాలరీ కి వెళ్తాము.
Do we go to a Gallery every Sunday?
మేము ప్రతీ ఆదివారం గ్యాలరీ కి వెళ్తామా?
We don’t (do not) go to a Gallery every Sunday.
మేము ప్రతీ ఆదివారం గ్యాలరీ కి వెళ్ళము.
Don’t we go to a Gallery every Sunday? (or)
Do we not go to a Gallery every Sunday?
మేము ప్రతీ ఆదివారం గ్యాలరీ కి వెళ్ళమా?

(38). They speak English in America. (or)
They do speak English in America.
వారు అమెరికాలో ఆంగ్లం మాట్లాడుతారు.
Do they speak English in America?
వారు అమెరికాలో ఆంగ్లం మాట్లాడతారా?
They don’t (do not ) speak English in America.
వారు అమెరికాలో ఆంగ్లం మాట్లాడరు.
Don’t they speak English in America? Do they not speak English in America?
వారు అమెరికాలో ఆంగ్లం మాట్లాడరా?

(39). Tiger kills animals for food. (or )
Tiger does kill animals for food.
పులి ఆహారం కోసం జంతువుల్ని చంపుతుంది.
Does a tiger kill animals for food?
పులి ఆహారం కోసం జంతువుల్ని చంపుతుందా?
Tiger doesn’t (does not) kill animals for food.
పులి ఆహారం కోసం జంతువుల్ని చంపదు.
Doesn’t a tiger kill animals for food?
Does Tiger not Kill animals for food?
పులి ఆహారం కోసం జంతువుల్ని చంపదా?

(40). Chintu brushes his teeth twice a day. (or )
Chintu does brush his teeth twice a day.
చింటూ రోజుకి రెండుసార్లు పళ్ళు తోముకుంటాడు.
Does Chintu brush his teeth twice a day?
చింటూ రోజుకి రెండుసార్లు పళ్ళు తోముకుంటాడా?
Chintu doesn’t (does not) brush his teeth twice a day.
చింటూ రోజుకి రెండుసార్లు పళ్ళు తోముకోడు.
Doesn’t Chintu brush his teeth twice a day?
Does Chintu not brush his teeth twice a day?
చింటూ రోజుకి రెండుసార్లు పళ్ళు తోముకోడా?

(41). We walk slowly. (or)
We do walk slowly.
మేము నెమ్మదిగా నడుస్తాము.
Do we walk slowly?
మేము నెమ్మదిగా నడుస్తామా?
We don’t (do not) walk slowly.
మేము నెమ్మదిగా నడవము.
Don’t we walk slowly?
Do we not walk slowly?
మేము నెమ్మదిగా నడవమా?

(42). He plays every day. (or)
He does play every day.
అతడు ప్రతీరోజు ఆడతాడు.
Does he play every day?
అతడు ప్రతీరోజు ఆడతాడా?
He doesn’t (does not) play every day.
అతడు ప్రతీ రోజు ఆడడు.
Doesn’t he play every day?
Does he not play every day?
అతడు ప్రతీరోజు ఆడడా?

(43). My sister plays the guitar every Sunday. (or)
My sister does play the guitar every Sunday.
నా సోదరి ప్రతీ ఆదివారం గిటార్ వాయిస్తాది.
Does my sister play the guitar every Sunday?
నా సోదరి ప్రతీ ఆదివారం గిటార్ వాయిస్తాదా?
My sister doesn’t (does not) play the guitar every Sunday.
నా సోదరి ప్రతీ ఆదివారం గిటార్ వాయించదు.
Doesn’t my sister play the guitar every Sunday?
Does my sister not play the guitar every Sunday?
నా సోదరి ప్రతీ ఆదివారం గిటార్ వాయించదా?

(44). We drink coffee every morning. (or)
We do drink coffee every morning.
ప్రతీ ఉదయం మేము కాఫీ తాగుతాము.
Do we drink coffee every morning?
ప్రతీ ఉదయం మేము కాఫీ తాగుతామా?
We don’t (do not) drink coffee every morning.
ప్రతీ ఉదయం మేము కాఫీ తాగము.
Don’t we drink coffee every morning?
Do we not drink coffee every morning?
ప్రతీ ఉదయం మేము కాఫీ తాగమా?

(45). I like apples. (or)
I do like apples.
నాకు ఆపిల్స్ అంటే ఇష్టం.
Do I like apples?
నాకు ఆపిల్స్ అంటే ఇష్టమా?
I do not (don’t) like apples.
నాకు ఆపిల్స్ ఇష్టం లేదు.
Do I not like apples?
Don’t I like apples?
నాకు ఆపిల్స్ ఇష్టం లేదా?

(46). He teaches math. (or)
He does teach math.
అతడు లెక్కలు బోధిస్తాడు.
Does he teach math?
అతడు లెక్కలు బోధిస్తాడా?
He doesn’t (does not) teach math.
అతడు లెక్కలు బోధించడు.
Doesn’t he teach math?
Does he not teach math?
అతడు లెక్కలు బోధించడా?

(47). Every child likes ice cream. (or)
Every child does like an ice cream
ప్రతీ పిల్లవాడు ఐస్ క్రీమ్ ఇష్టపడతాడు.
Does every child like ice cream?
ప్రతీ పిల్లవాడు ఐస్ క్రీమ్ ఇష్టపడతాడా?
Every child doesn’t (does not) like ice cream.
ప్రతీ పిల్లవాడు ఐస్ క్రీమ్ ఇష్టపడడు.
Doesn’t every child like ice cream? (or)
Does every child not like ice cream?
ప్రతీ పిల్లవాడు ఐస్ క్రీమ్ ఇష్టపడడా?

(48). He gets up early every day. (or)
He does get up early every day.
అతడు ప్రతీ రోజూ పొద్దున్నే లేస్తాడు.
Does he get up early every day?
అతడు ప్రతీ రోజూ పొద్దున్నే లేస్తాడా?
He doesn’t (does not ) get up early every day.
అతడు ప్రతీ రోజూ పొద్దున్నే లేవడు.
Does he not get up early every day? (or)
Doesn’t he get up early every day?
అతడు ప్రతీ రోజూ పొద్దున్నే లేవడా?

(49). The course starts from next Monday.(or)
The course does start from next Monday.
వచ్చే సోమవారం నుంచి కోర్సు ప్రారంభమవుతుంది.
Does the course start from next Monday?
వచ్చే సోమవారం నుంచి కోర్సు ప్రారంభమవుతుందా?
The course doesn’t (does not) start from next Monday.
వచ్చే సోమవారం నుంచి కోర్సు ప్రారంభం అవ్వదు.
Doesn’t the course start from next Monday? (or)
Does the course not start from next Monday?
వచ్చే సోమవారం నుంచి కోర్సు ప్రారంభం అవ్వదా?

(50). We try our best on anything. (or)
We do try our best on anything.
మేము దేనికైనా మా వంతు ప్రయత్నం చేస్తాము.
Do we try our best on anything?
మేము దేనికైనా మా వంతు ప్రయత్నం చేస్తామా?
We don’t (do not) try our best on anything.
మేము దేనికైనా మా వంతు ప్రయత్నం చేయము.
Don’t we try our best on anything?
Do we not try our best on anything?
మేము దేనికైనా మా వంతు ప్రయత్నం చేయమా?

 

FOR MORE CLICK HERE

🔴Related Post

Leave a Comment